డిజిటల్ ఇండియా అవార్డును గెలుచుకున్న తెలంగాణ జిల్లా?
Sakshi Education
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డిజిటల్ ఇండియా పురస్కారాల్లో తెలంగాణలోని కామారెడ్డి జిల్లాకు ‘ఎక్స్‌లెన్స్ ఇన్ డిజిటల్ గవర్నెన్స్’ అవార్డు లభించింది.
డిసెంబర్ 30న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో వర్చువల్ విభాగంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిజిటల్ ఇండియా అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ అవార్డును అందుకున్నారు.
ప్రభుత్వరంగ సంస్థలు పాలనా వ్యవహారాల్లో ఉపయోగిస్తున్న వినూత్న డిజిటల్ విధానాలను గుర్తించి కేంద్ర ఎలక్టాన్రిక్, ఐటీ శాఖ ఆరు విభాగాల్లో 22 ప్రభుత్వ వ్యవస్థలను డిజిటల్ ఇండియా అవార్డులకు ఎంపిక చేసింది. ఇందులో కామారెడ్డి జిల్లా ‘ఎక్స్‌లెన్స్ ఇన్ డిజిటల్ గవర్నెన్స్ - జిల్లా విభాగం’లో సిల్వర్ ఐకాన్ అవార్డు గెలుచుకొంది. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోనే జిల్లా ప్లాటినమ్ ఐకాన్ అవార్డును, అరుణాచల్ ప్రదేశ్‌లోని చాంగ్‌లాంగ్ జిల్లా గోల్డ్ ఐకాన్ అవార్డును గెలుచుకున్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : డిజిటల్ ఇండియా అవార్డుల్లో సిల్వర్ ఐకాన్ అవార్డును గెలుచుకున్న తెలంగాణ జిల్లా
ఎప్పుడు : డిసెంబర్ 30
ఎవరు : కామారెడ్డి జిల్లా
ఎక్కడ : ఎక్స్‌లెన్స్ ఇన్ డిజిటల్ గవర్నెన్స్ - జిల్లా విభాగంలో
ఎందుకు : పాలనా వ్యవహారాల్లో ఉపయోగిస్తున్న వినూత్న డిజిటల్ విధానానికి గుర్తింపుగా

Published date : 31 Dec 2020 06:11PM