Skip to main content

డీడీసీఏ అంబుడ్స్‌మన్‌గా నియమితులైన రిటైర్డ్ జస్టిస్?

ఢిల్లీ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) అంబుడ్స్‌మన్‌‌గా కొనసాగుతున్న జస్టిస్ (రిటైర్డ్) దీపక్ వర్మను ఆ రాష్ట్ర సంఘం పదవినుంచి తప్పించింది.
Current Affairs
డీడీసీఏకు అంబుడ్‌‌సమన్‌గా ఉంటూనే ఇటీవల ఆయన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అంబుడ్స్‌మన్‌‌గా కూడా బాధ్యతలు స్వీకరించడమే అందుకు కారణం. దీపక్ వర్మ స్థానంలో జస్టిస్ (రిటైర్డ్) బదర్ దుర్రేజ్ అహ్మద్‌ను డీడీసీఏ అపెక్స్ కౌన్సిల్ సెప్టెంబర్ 13న నియమించింది.

శ్రీశాంత్‌పై ముగిసిన నిషేధం
2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో చిక్కుకున్న భారత మాజీ పేసర్ శ్రీశాంత్‌కు విముక్తి లభించింది. అతడిపై విధించిన ఏడేళ్ల నిషేధం సెప్టెంబర్ 13న ముగిసింది. భారత్ తరఫున 27 టెస్టులు, 53 వన్డేలు ఆడిన శ్రీశాంత్... టెస్టుల్లో 87, వన్డేల్లో 75 వికెట్లు పడగొట్టాడు. 2007 టి20, 2011 వన్డే ప్రపంచకప్‌లు గెలిచిన భారత జట్లలో అతను సభ్యుడు. తన నిషేధం ముగిసిన వెంటనే రంజీల్లో తన రాష్ట్రం (కేరళ) తరఫున ఆడాలని ఉందని శ్రీశాంత్ తెలిపాడు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : డీడీసీఏ అంబుడ్స్‌మన్‌‌గా నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 13
ఎవరు : జస్టిస్ (రిటైర్డ్) బదర్ దుర్రేజ్ అహ్మద్
Published date : 19 Sep 2020 11:46AM

Photo Stories