Skip to main content

డీఆర్‌డీఓ యంగ్ సైంటిస్ట్స్ లేబరేటరీస్ ప్రారంభం

ఆధునిక సాంకేతికలను వృద్ధి చేసేందుకు రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ) ఏర్పాటు చేసిన ‘డీఆర్‌డీఓ యంగ్ సైంటిస్ట్స్ లేబరేటరీస్(డీవైఎస్‌ఎల్)’ను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు.
Current Affairsబెంగళూరులో జనవరి 2న జరిగిన కార్యక్రమంలో ప్రధాని వీటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. ‘మీ సామర్ధ్యం అనంతం. మీరెన్నో చేయగలరు. పరిధిని విసృ్తతం చేసుకోండి. సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకోండి’ అని చెప్పారు. బెంగళూరు, చెన్నై, ముంబై, కోల్‌కతా, హైదరాబాద్‌ల్లో ఈ డీవైఎస్‌ఎల్‌లను ఏర్పాటు చేశారు.

సిద్దగంగమఠ్ సందర్శన
కర్ణాటకలోని తుమకూరులో ఉన్న సిద్దగంగమఠ్‌ను ప్రధాని మోదీ సందర్శించారు. సిద్దగంగమఠ్‌లో గత సంవత్సరం చనిపోయిన శివకుమార స్వామీజీ సమాధి వద్ద ఆయన నివాళులర్పించారు.

6 కోట్ల మంది రైతులకు 12 వేల కోట్లు
తుమకూరులో ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన’ రెండో దశను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ పథకం కింద కింద 6 కోట్లమంది రైతులకు రూ. 12 వేల కోట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులకు ‘కృషి కర్మన్’ పురస్కారాలను ప్రధాని అందజేశారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
డీఆర్‌డీఓ యంగ్ సైంటిస్ట్స్ లేబరేటరీస్ ప్రారంభం
ఎప్పుడు : జనవరి 2
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : బెంగళూరు
ఎందుకు : ఆధునిక సాంకేతికలను వృద్ధి చేసేందుకు

మాదిరి ప్రశ్నలు
Published date : 03 Jan 2020 05:59PM

Photo Stories