దేశంలోనే తొలిసారి ఆన్‌లైన్‌లో కోర్టు ఫీజు
Sakshi Education
ఆన్‌లైన్ ద్వారా కోర్టు ఫీజులు చెల్లింపునకు వీలుగా తెలంగాణ హైకోర్టు-స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)ల మధ్య ఒప్పందం కుదిరింది.
దేశంలోనే తొలిసారిగా ఈ విధానాన్ని తెలంగాణ హైకోర్టులో అమలు చేయనున్నారు. డిజిటల్ సేవల్ని వినియోగంలోకి తెచ్చే క్రమంలో ఎస్‌బీఐతో కుదిరిన ఒప్పందం మేరకు జూన్ 19న సాయంత్రం హైకోర్టు ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఎంఓయూ కుదిరింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, ఎస్‌బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ ఓం ప్రకాశ్ మిశ్రాల సమక్షంలో హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్‌బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ గీతా ఎస్.పిళ్లైలు ఎంఓయూ పత్రాలపై సంతకాలు చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: తొలిసారిగా ఆన్‌లైన్ ద్వారా కోర్టు ఫీజుల చెల్లింపులు
ఎవరు: హైకోర్టు-స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)
ఎప్పుడు: జూన్ 19న
ఎక్కడ: తెలంగాణ
క్విక్ రివ్యూ:
ఏమిటి: తొలిసారిగా ఆన్‌లైన్ ద్వారా కోర్టు ఫీజుల చెల్లింపులు
ఎవరు: హైకోర్టు-స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)
ఎప్పుడు: జూన్ 19న
ఎక్కడ: తెలంగాణ
Published date : 20 Jun 2019 06:01PM