Skip to main content

దేశంలోనే తొలి ట్రాన్స్ జెండర్ వర్సిటీ

దేశంలోనే మొట్టమొదటి సారిగా ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేకంగా యూనివర్సిటీ రూపుదిద్దుకుంది.
Current Affairsఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్ జిల్లాలో 2020 ఏడాది జనవరిలో ప్రారంభం కానుంది. అఖిల భారతీయ కిన్నర్ శిక్షా సేవా ట్రస్టు(ఏఐటీఈఎస్‌టీ) ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. ఈ విషయమై ఏఐటీఈఎస్‌టీ అధ్యక్షుడు డాక్టర్ క్రిష్ణమోహన్ మిశ్రా మాట్లాడుతూ... ‘ ఈ యూనివర్సిటీలో శిశు తరగతి నుంచి పీహెచ్‌డీ వరకు అన్ని కోర్సులు అందుబాటులో ఉంటాయి. జనవరి 15 నుంచి కొన్ని క్లాసులు ప్రారంభం అవుతాయి. ఫిబ్రవరి, మార్చి నుంచి అన్ని తరగతులు ప్రారంభమవుతాయి’ అని పేర్కొన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
దేశంలోనే తొలి ట్రాన్స్ జెండర్ వర్సిటీ
ఎప్పుడు : డిసెంబర్ 26
ఎవరు : అఖిల భారతీయ కిన్నర్ శిక్షా సేవా ట్రస్టు(ఏఐటీఈఎస్‌టీ)
ఎక్కడ : ఖుషీనగర్, ఉత్తరప్రదేశ్
Published date : 27 Dec 2019 05:33PM

Photo Stories