Skip to main content

దేశంలోనే పిన్నవయసు గవర్నర్‌గా తమిళిసై

తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షురాలైన తమిళిసై సౌందరరాజన్(58) సెప్టెంబర్ 8న తెలంగాణ గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేశారు.
దీంతో ప్రస్తుతం దేశంలోనే అత్యంత పిన్నవయస్కురాలైన గవర్నర్‌గా ఆమె గుర్తింపుపొందారు. ప్రస్తుతం దేశంలోని 29 రాష్ట్రాలకు నియమితులైన 28 గవర్నర్లలో ఒక్క తమిళి సై మాత్రమే 60 ఏళ్లలోపు వయసువారు. గుజరాత్ గవర్నర్‌గా పనిచేస్తున్న ఆచార్య దేవవ్రత్(60) పిన్న వయస్కుల జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్(85) దేశంలోనే అత్యంత పెద్దవయస్కుడైన గవర్నర్‌గా నిలిచారు. హరిచందన్ తర్వాత మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్(84) రెండో స్థానంలో నిలిచారు. మొత్తం 28 మంది గవర్నర్లలో చాలామంది 70-79 ఏళ్ల వయసువారే ఉన్నారు.
Published date : 11 Sep 2019 05:33PM

Photo Stories