దేశంలో తొలిసారి కుక్కకు పేస్‌మేకర్
Sakshi Education
భారత్‌లో తొలిసారి ఓ కుక్కకు పేస్‌మేకర్ విజయవంతంగా అమర్చారు.
కాకర్ స్పేనియల్ జాతికి చెందిన కుక్క ఖుషి (7.5 ఏళ్లు)కి ఢిల్లీలోని మాక్స్ వెటర్నరీ ఆస్పత్రిలో ఈ ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్‌కు ముందు కుక్క గుండె వేగం నిమిషానికి 20కి పడిపోయిందని, కుక్కల సాధారణ గుండె వేగం నిమిషానికి 60-120 సార్లు ఉంటుందని వైద్యులు తెలిపారు. 2019, డిసెంబర్ 15న దాదాపు గంటన్నర పాటు ఈ ఆపరేషన్ జరిగినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ శునకం పరిస్థితి సాధారణంగా ఉందని దాని యజమాని మను మీడియాకు తెలిపారు.
Published date : 10 Feb 2020 05:55PM