దేశంలో అత్యంత సంపన్న మహిళ?
Sakshi Education
దేశంలో అత్యంత సంపన్న మహిళగా ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చైర్‌పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా నిలిచారు. రోష్ని సంపద రూ. 54,850 కోట్లుగా ఉంది.
రోష్ని తర్వాత రూ. 36,600 కోట్ల సంపదతో బయోకాన్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా రెండో స్థానంలోనూ, రూ. 11,590 కోట్లతో రాధా వెంబు (జోహో) మూడో స్థానంలో, రూ. 18,620 కోట్లతో నీలిమ మోటపర్తి(దివీస్) నాలుగో స్థానంలో ఉన్నారు. హురున్ ఇండియా, కోటక్ వెల్త్ సంయుక్తంగా రూపొందించిన 100 మంది భారతీయ సంపన్న మహిళల జాబితాలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
తాజా జాబితాలో మహిళల సంపద సగటు విలువ సుమారు రూ. 2,725 కోట్లుగా ఉంది. కనీసం రూ. 100 కోట్ల సంపద గలవారిని జాబితాలో పరిగణనలోకి తీసుకున్నారు. అత్యధికంగా ముంబైలో 32 మంది, న్యూఢిల్లీలో 20, హైదరాబాద్‌లో 10 మంది సంపన్న మహిళలు ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అత్యంత సంపన్న మహిళగా హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చైర్‌పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా
ఎప్పుడు : డిసెంబర్ 3
ఎవరు : హురున్ ఇండియా, కోటక్ వెల్త్ నివేదిక
ఎక్కడ : భారత్

Published date : 04 Dec 2020 06:09PM