దేశీయంగా మొత్తం ఇంధనాల వినియోగంలో గ్యాస్ వాటా?
Sakshi Education
అసోచాం ఫౌండేషన్ డే వీక్ 2020 కార్యక్రమంలో కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ డిసెంబర్ 17న పాల్గొన్నారు.
కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ... దేశీయంగా గ్యాస్ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు 2024 నాటికి 60 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టాలని కేంద్రం భావిస్తున్నట్లు వెల్లడించారు. 2030 నాటికి మొత్తం ఇంధనాల వినియోగంలో గ్యాస్ వాటాను 15 శాతానికి పెంచుకునే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఇది 6 శాతంగా ఉంది.
Published date : 18 Dec 2020 06:45PM