Skip to main content

దేశీ డెవలపర్ల కోసం మినీ యాప్ స్టోర్ ఆవిష్కరించిన సంస్థ?

కొద్ది రోజుల క్రితం నిబంధనల ఉల్లంఘన పేరుతో తమ యాప్‌ను ప్లేస్టోర్ నుంచి తొలగించిన టెక్ దిగ్గజం గూగుల్‌తో తలపడేందుకు దేశీ ఈ-కామర్స్ చెల్లింపుల సంస్థ పేటీఎం సిద్ధమయి్యంది.
Current Affairs
ఇందులో భాగంగా తాజాగా దేశీ డెవలపర్ల కోసం ఆండ్రాయిడ్ మినీ యాప్ స్టోర్‌ను అక్టోబర్ 5న ఆవిష్కరించింది. తమ యాప్‌లో అంతర్గతంగా మినీ-యాప్స్‌ను లిస్టింగ్ చేయడానికి ఎటువంటి చార్జీలు ఉండబోవని తెలిపింది. ప్రస్తుతం ఈ యాప్ స్టోర్ బీటా వెర్షన్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు పేర్కొంది.

పేటీఎం వ్యవస్థాపకుడు ఎవరు?
‘ప్రతీ భారతీయ యాప్ డెవలపర్‌కూ సాధికారత కల్పించేలా పేటీఎం మినీ యాప్ స్టోర్ ఆవిష్కరించడం సంతోషకరమైన విషయం‘ అని పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ తెలిపారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : పేటీఎం మినీ యాప్ స్టోర్ ఆవిష్కరణ
ఎప్పుడు : అక్టోబర్ 5
ఎవరు : దేశీ ఈ-కామర్స్ చెల్లింపుల సంస్థ పేటీఎం
ఎందుకు : దేశీ డెవలపర్ల కోసం
Published date : 07 Oct 2020 05:54PM

Photo Stories