Skip to main content

డబ్ల్యూటీఏ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా బార్టీ

డబ్ల్యూటీఏ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్-2019గా ఆస్ట్రేలియాకి చెందిన యాష్లే బార్టీ ఎంపికైంది. ఈ విషయాన్ని ప్రపంచ మహిళల టెన్నిస్ సమాఖ్య(డబ్ల్యూటీఏ) డిసెంబర్ 12న ప్రకటించింది.
Current Affairs 2019 ఏడాదిలో మొత్తం నాలుగు టైటిల్స్ నెగ్గిన బార్టీ, ఫ్రెంచ్ ఓపెన్‌లో విజేతగా నిలిచి కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ దక్కించుకుంది. అనంతరం టెన్నిస్ ముగింపు సీజన్ టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లోనూ విజయకేతనం ఎగురవేసింది. తద్వారా మహిళల విభాగంలో నెం.1గా అవతరించింది. ప్రస్తుతం బార్టీ ఖాతాలో 7851 పాయింట్లు ఉన్నాయి. రెండో ర్యాంకులో ఉన్న కరోలినా ప్లిస్కోవా(చెక్ రిపబ్లక్) ఖాతాలో 5940 పాయింట్లు ఉన్నాయి.
 
 కోచ్ ఆఫ్ ది ఇయర్‌గా టైజర్

 డబ్ల్యూటీఏ కోచ్ ఆఫ్ ది ఇయర్-2019గా యాష్లే బార్టీ కోచ్ క్రెయిగ్ టైజర్ ఎంపికయ్యాడు. అలాగే న్యూకమర్ ఆఫ్ ది ఇయర్-2019గా కెనడా టీనేజర్, యూఎస్ ఓపెన్ చాంపి యన్ బియాంకా ఆండ్రీస్కూ ఎంపికైంది. మోస్ట్ ఇంప్రూవ్‌‌డ ప్లేయర్‌గా సోషియా కెనిన్(అమెరికా), కమ్ బ్యాక్ ప్లేయర్‌గా బెలిందా బెనిసిచ్ (స్విట్జర్లాండ్), అత్యుత్తమ డబుల్స్ జంటగా టిమియా బాబోస్- క్రిస్టినా మాల్దె నోవిచ్ ఎంపికయ్యారు.

 క్విక్ రివ్యూ   :
 ఏమిటి :
డబ్ల్యూటీఏ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్-2019గా ఎంపిక
 ఎప్పుడు  : డిసెంబర్ 12
 ఎవరు  : యాష్లే బార్టీ
Published date : 13 Dec 2019 05:52PM

Photo Stories