డబ్ల్యూఈఎఫ్ 50వ వార్షిక సదస్సు ప్రారంభం
Sakshi Education
ప్రపంచ దేశాల అధినేతలు, విధానకర్తలు, వ్యాపార దిగ్గజాలు, ఇతరత్రా ప్రముఖులు హాజరయ్యే వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 50వ వార్షిక సదస్సు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జనవరి 21న ప్రారంభమైంది.
జనవరి 24 వరకు జరగనున్న ఈ సదస్సు సందర్భంగా డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ క్లాస్ ష్వాబ్ మాట్లాడారు. వ్యాపార సంస్థలు కేవలం వ్యాపారానికే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతతో మెలగాల్సిన అవసరం ఉందన్న ఉద్దేశంతో ఫోరం ఏర్పడిందని, ఇప్పటికీ అదే స్ఫూర్తితో కొనసాగుతోందని ష్వాబ్ చెప్పారు.
పారదర్శక వాణిజ్యం కోసం కృషి : గోయల్
పారదర్శకమైన, సమతుల్యమైన వాణిజ్య భాగస్వామ్యాల కోసం భారత్ కృషి చేస్తోందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ డబ్ల్యూఈఎఫ్ వార్షిక సదస్సులో స్పష్టం చేశారు. హిందూ మహాసముద్ర తీర ప్రాంత దేశాల్లో వృద్ధికి ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సహకారం మరింత విసృ్తతం కావాలని పిలుపునిచ్చారు. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (ఆర్‌సీఈపీ) ప్రస్తుత రూపంలో ఉన్నది భారత్‌కు ఆమోదనీయం కాదన్నారు.
అన్నింటిలోనూ కృత్రిమ మేధస్సు : కేటీఆర్
డబ్ల్యూఈఎఫ్ సదస్సులో ఏఐ పరిజ్ఞానంపై జరిగిన చర్చలో తెలంగాణా ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు మాట్లాడారు. ‘కృత్రిమ మేధస్సు (ఏఐ) విప్లవం ప్రభావానికి లోనుకాకుండా ఏ ఒక్క వ్యాపారమూ ఉండదు. ప్రతి వ్యాపార వ్యూహం, విధాన రూపకల్పనలో ఏఐ పరిజ్ఞానం తప్పనిసరి. ప్రభుత్వ, ప్రభుత్వేతర, ఐటీ, నాన్ ఐటీ సంస్థలైనా ఏఐను అనుసరించాల్సిందే. మా కార్యక్రమాలన్నింటిలో ఏఐను అంతర్భాగం చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం 2020ను ఏఐకు అంకితం చేసింది’ అని కేటీఆర్ తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 50వ వార్షిక సదస్సు ప్రారంభం
ఎప్పుడు : జనవరి 21
ఎక్కడ : దావోస్, స్విట్జర్లాండ్

Published date : 22 Jan 2020 06:18PM