డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీ విలీనం
Sakshi Education
కేంద్ర పాలిత ప్రాంతాలైన డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీలను ఒకే కేంద్ర పాలిత ప్రాంతం కిందకు మార్చేందుకు కేంద్రం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఈ మేరకు పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థల సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్‌సభలో నవంబర్ 23న తెలిపారు. పాలనను మరింత సులభతరం చేసేందుకే వీటిని కలపనున్నట్లు చెప్పారు.
కేవలం 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీలకు వేర్వేరు సచివాలయాలు, బడ్జెట్ ఉన్నాయి. రెండు ప్రాంతాలను ఏకం చేసిన తర్వాత ఏర్పడే కేంద్రపాలిత ప్రాంతానికి ‘దాద్రా, నాగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ’ అనే పేరు పెట్టే అవకాశం ఉంది. దీంతో కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 8కి తగ్గనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : త్వరలో డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీ విలీనం
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : కేంద్రప్రభుత్వం
ఎందుకు : పాలనను మరింత సులభతరం చేసేందుకు

Published date : 23 Nov 2019 05:49PM