Skip to main content

Central Election Commission: డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌గా నియమితులైన ఐఏఎస్‌ అధికారి?

కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌గా 2004 బ్యాచ్‌ కేంద్ర పాలిత ప్రాంతాల(యూటీ) క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి టి.శ్రీకాంత్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది.
ఈ మేరకు ఆగస్టు 23న ఉత్తర్వులు జారీ అయ్యాయి. చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన శ్రీకాంత్‌ ఇప్పటివరకు కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర శాఖల్లో వివిధ హోదాల్లో సేవలందించారు. 2012 సెప్టెంబర్‌ నుంచి 2014 జూలై మధ్య పుదుచ్చేరి చీఫ్‌ ఎలక్ట్రోరల్‌ ఆఫీసర్‌గా పని చేశారు. 2023 వరకు కేంద్ర సర్వీసుల్లో డిప్యూటేషన్‌పై ఉన్న ఆయన అప్పటివరకు కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission)లో డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
క్విక్రివ్యూ :
ఏమిటి : కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌గా నియమితులైన ఐఏఎస్‌ అధికారి?
ఎప్పుడు : ఆగస్టు 23
ఎవరు : టి.శ్రీకాంత్‌
ఎందుకు : ప్రభుత్వ నిర్ణయం మేరకు...
Published date : 24 Aug 2021 06:09PM

Photo Stories