చట్టసభల్లో రిజర్వేషన్ల పొడిగింపునకు ఆమోదం
Sakshi Education
లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ సభ్యుల్లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు(ఎస్సీ, ఎస్టీ) రిజర్వేషన్లను పొడిగించేందుకు ఉద్దేశించిన 126వ రాజ్యాంగ సవరణ బిల్లుకు డిసెంబర్ 10న లోక్‌సభ ఆమోదం తెలిపింది.
ఈ బిల్లు ప్రకారం ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు జనవరి 25, 2020తో ముగియనుండగా, వాటిని జనవరి 25, 2030 వరకు పొడిగిస్తారు. ఆంగ్లో-ఇండియన్ వర్గానికి మాత్రం ఈ పొడిగింపు ఇవ్వలేదు. ప్రస్తుతం పార్లమెంట్లో ఎస్సీ సభ్యులు 84 మంది, ఎస్టీ సభ్యులు 47 మంది ఉన్నారు. రాష్ట్రాల శాసనసభల్లో 614 ఎస్సీ, 554 ఎస్టీ సభ్యులున్నారు.
మరోవైపు నౌకల రిసైక్లింగ్ ప్రక్రియను నియంత్రించేందుకు ఉద్దేశించిన బిల్లుకు రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : చట్టసభల్లో రిజర్వేషన్ల పొడిగింపునకు ఆమోదం
ఎప్పుడు : డిసెంబర్ 10
ఎవరు : లోక్‌సభ

Published date : 10 Dec 2019 06:20PM