చంద్రయాన్-2 జాబిల్లి చిత్రాలు విడుదల
Sakshi Education
చంద్రయాన్-2లో భాగంగా చంద్రుడి చుట్టూ చక్కర్లు కొడుతున్న ఆర్బిటర్ తీసిన ఛాయాచిత్రాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అక్టోబర్ 5న విడుదల చేసింది.
చంద్రుడి నుంచి సుమారు వంద కిలోమీటర్ల దూరం నుంచి హై రెజల్యూషన్ కెమెరా ద్వారా ఆర్బిటర్ ఈ చిత్రాలను తీసింది. ఈ చిత్రాలు బోగుస్లావ్‌స్కీ ప్రాంతానికి సంబంధించినవని ఇస్రో తెలిపింది. సుమారు 14 కిలోమీటర్ల వ్యాసం, మూడు కిలోమీటర్ల లోతు ఉన్న ఈ లోయను ఆర్బిటర్ చిత్రీకరించింది. దక్షిణ ధ్రువానికి సమీపంలో ఉన్న బోగుస్లావ్‌స్కీ లోయ చిత్రాల్లో పెద్ద పెద్ద రాళ్ల వంటి నిర్మాణాలతోపాటు చిన్న గుంతల్లాంటివి ఉన్నాయి.
Published date : 07 Oct 2019 06:57PM