Skip to main content

చంద్రుడిపై చాంగ్ ఈ - 4 స్పేస్‌క్రాఫ్ట్

చైనా డిసెంబర్ 7న ప్రయోగించిన ‘ది చాంగ్ ఈ - 4’ స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుడిపై విజయంతంగా దిగింది.
చంద్రుడి దక్షిణ ధృవం వద్ద ఉండే ‘ఐన్‌క్యూన్’ బేసిన్‌లో జనవరి 3న చాంగ్ ఈ-4 దిగినట్లు చైనా అంతరిక్ష పరిశోధన సంస్థ వెల్లడించింది. దీంతో చంద్రుడి దక్షిణ దృవానికి(చంద్రుడికి అవతలి వైపు చీకటి ప్రాంతం) చేరుకున్న మొదటి స్పేస్‌క్రాఫ్ట్‌గా చాంగ్ ఈ-4 నిలిచింది. చంద్రుడిపై ఉండే అత్యల్ప గురుత్వాకర్షణ వాతావరణంతో పాటు చంద్రుడి ధృవాలు, నీటి లభ్యతపై ఈ స్పేస్‌క్రాఫ్ట్ పరిశోధనలు చేయనుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి : చంద్రుడిపై దిగిన ది చాంగ్ ఈ - 4 స్పేస్‌క్రాఫ్ట్
ఎప్పుడు : జనవరి 3
ఎవరు : చైనా
Published date : 04 Jan 2019 05:48PM

Photo Stories