చిరు వ్యాపారుల కోసం ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన కొత్త పథకం?
Sakshi Education
చిరు వ్యాపారులు, సంప్రదాయ వృత్తిదారులకు రూ.పది వేల వరకు వడ్డీలేని రుణం అందించేందుకు ఉద్దేశించిన ‘జగనన్న తోడు’ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది.
నవంబర్ 25న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్ నొక్కి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద చిరు వ్యాపారులతో పాటు, కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక, బొబ్బిలి వీణ, ఇత్తడి పాత్రల తయారీదారులు, కలంకారీ పనులు చేసే వారికి కూడా రూ.10 వేల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తారు.
సుమారు 10 లక్షల మందికి...
జగనన్న తోడు పథకం ద్వారా... సుమారు 10 లక్షల మందికి దాదాపు రూ.1,000 కోట్ల రుణాలు ఇవ్వనున్నారు. ఇందుకు ప్రభుత్వం ఏటా రూ.60 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు వడ్డీ చెల్లిస్తుంది. దాన్ని పదేళ్లకు తీసుకుంటే రూ.1,000 కోట్లు అవుతుంది. ప్రభుత్వం ఆ వడ్డీని ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : చిరు వ్యాపారుల కోసం ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన కొత్త పథకం
ఎప్పుడు : నవంబర్ 25
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం
ఎందుకు : చిరు వ్యాపారులు, సంప్రదాయ వృత్తిదారులకు రూ.పది వేల వరకు వడ్డీలేని రుణం అందించేందుకు

Published date : 26 Nov 2020 06:07PM