చిన్నారులు-పౌష్టికాహారం అంశంపై ఉప రాష్ట్రపతి ఆవిష్కరించిన పుస్తకం?
Sakshi Education
చిన్నారులు-పౌష్టికాహారం అనే అంశంపై మొబైల్ క్రీచెస్ రూపొందించిన ‘స్టేట్ ఆఫ్ యంగ్ చైల్డ్ ఇన్ ఇండియా’ పుస్తకాన్ని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఆన్‌లైన్ వేదికగా ఆవిష్కరించారు.
ఢిల్లీలోని ఉప రాష్ట్రపతి నివాసంలో సెప్టెంబర్ 4న జరిగిన ఈ కార్యక్రమంలో వెంకయ్య మాట్లాడుతూ... ఆరోగ్య భారత నిర్మాణంలో భాగంగా చిన్నారులకు పౌష్టికాహారం అందించడం అత్యంత కీలకమైన అంశమని పేర్కొన్నారు. దేశంలో ఉన్న 15.9 కోట్ల ఆరేళ్లలోపు చిన్నారుల్లో 21 శాతం మందిలో పోషకాహార లోపం, 36 శాతం మంది తక్కువ బరువుతో ఉండడం, 38 శాతం మందికి టీకాలు అందడం లేదని పుస్తకంలో ఉన్న అంశాలు ప్రస్తావించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్టేట్ ఆఫ్ యంగ్ చైల్డ్ ఇన్ ఇండియా పుస్తకావిష్కరణ
ఎప్పుడు : సెప్టెంబర్ 4
ఎవరు : ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్టేట్ ఆఫ్ యంగ్ చైల్డ్ ఇన్ ఇండియా పుస్తకావిష్కరణ
ఎప్పుడు : సెప్టెంబర్ 4
ఎవరు : ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు
Published date : 05 Sep 2020 05:17PM