చిన్న ఎగుమతిదారుల కోసం నిర్విక్ పథకం
Sakshi Education
దేశంలోని చిన్న ఎగుమతిదారులను ప్రొత్సహించడానికి కొత్తగా నిర్విక్ పథకంను ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
2022లో భారత్‌లో జీ 20 సదస్సు
త్వరలో జాతీయ లాజిస్టిక్స్ పాలసీ తెస్తామని, ప్రైవేటు రంగంలో డేటా సెంటర్ పార్క్‌లు ఏర్పాటు చేయనున్నామని 2020-21 బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఇకనుంచి యంత్రాలతో సెప్టెక్ ట్యాంకుల క్లినింగ్ చేసేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.కరెంటు బిల్లుల స్థానంలో త్వరలో స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు తీసుకురానున్నామని చెప్పారు. ఆప్టికల్ ఫైబర్ లింక్‌తో లక్ష గ్రామపంచాయతీల అనుసంధానం చేస్తామని తెలిపారు.
2020-21 బడ్జెట్-ముఖ్యాంశాలు
- డిపాజిట్ భీమా పరిధి రూ లక్ష నుంచి రూ 5 లక్షలకు పెంపు
- పన్ను అధికారుల వేధింపులను సహించం
- కొన్ని నిబంధనల ఉల్లంఘనలపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ తప్పించేలా కంపెనీ చట్టం సవరణ
- 2022లో భారత్‌లో జీ 20 సదస్సు
- రూ 100 కోట్లతో సన్నాహక ఏర్పాట్లు
- సహకార బ్యాంకుల పరిపుష్టి
- గిఫ్ట్ సిటీలో ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్ఛేంజ్
- షేర్ల అమ్మకం ద్వారా ఎల్ఐసీలోప్రభుత్వ వాటా పాక్షిక విక్రయం
- ఐడీబీఐ బ్యాంకులోని ప్రభుత్వ వాటా అమ్మకం
- 2021లో జీడీపీ వృద్ధిరేటు పెరుగుతుందని ఆశాభావం
- వచ్చే సంవత్సరానికి జీడీపీ వృద్ధిరేటు 10శాతం వరకు పెరుగుతుందని ఆశాభావం
2022లో భారత్‌లో జీ 20 సదస్సు
- పన్ను అధికారుల వేధింపులను సహించం
- కొన్ని నిబంధనల ఉల్లంఘనలపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ తప్పించేలా కంపెనీ చట్టం సవరణ
- 2022లో భారత్‌లో జీ 20 సదస్సు రూ 100 కోట్లతో సన్నాహక ఏర్పాట్లు
Published date : 01 Feb 2020 02:36PM