Skip to main content

చెన్నైలో మోదీ-జిన్‌పింగ్ భేటీ

తమిళనాడు రాజధాని చెన్నైకి సూమారు 56 కి.మీ. దూరంలో ఉన్న మహాబలిపురంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భేటీ కానున్నారు.
2019, అక్టోబర్ 11-13 మధ్య జరగనున్న ఈ సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, వాణిజ్య సంబంధాలు, అంతర్జాతీయ సమస్యలు తదితర కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చలు జరపనున్నారు. అలాగే ఆర్థిక మాంద్యం, అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం, డోక్లాం వివాదం, హిందూ మహాసముద్రంలో చైనా నౌకల కదలికలు పెరగడం వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భేటీ
ఎప్పుడు : అక్టోబర్ 11-13
ఎక్కడ : మహాబలిపురం, తమిళనాడు
Published date : 04 Oct 2019 05:39PM

Photo Stories