చెక్ రిపబ్లిక్ సంస్థ గైడ్‌విజన్‌ను కొనుగోలు చేయనున్న భారత సంస్థ?
Sakshi Education
ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ తాజాగా చెక్ రిపబ్లిక్‌కు చెందిన గైడ్‌విజన్ సంస్థను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది.
ఈ డీల్ విలువ 30 మిలియన్ యూరోల దాకా (సుమారు 260.4 కోట్లు) ఉండవచ్చని పేర్కొంది. తమ అనుబంధ సంస్థ ఇన్ఫీ కన్సల్టింగ్ కంపెనీ ద్వారా ఈ ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు సెప్టెంబర్ 14న తెలిపింది. చెక్ రిపబ్లిక్, హంగరీ, పోలాండ్, జర్మనీ, ఫిన్‌లాండ్ దేశాల్లోని గైడ్‌విజన్ సెంటర్ల తోడ్పాటుతో యూరప్‌లోని క్లయింట్లకు తమ సర్వీస్‌నౌ విభాగం మరింత మెరుగైన సర్వీసులు అందించడానికి వీలవుతుందని వివరించింది. ఇన్ఫోసిస్‌లో భాగమైన సర్వీస్‌నౌ.. వివిధ క్లౌడ్ కంప్యూటింగ్ సర్విసులను అందిస్తోంది. 2014లో చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్‌లో ఏర్పాటైన గైడ్‌విజన్ 100 పైగా క్లయింట్లకు ఐటీ సొల్యూషన్స్ అందిస్తోంది.
ఒరాకిల్‌కు టిక్‌టాక్ యాప్...
వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ అమెరికా విభాగాన్ని ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ దక్కించుకోలేకపోయింది. మైక్రోసాఫ్ట్‌కి విక్రయించరాదని చైనాకు చెందిన టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ నిర్ణయించుకుంది. అమెరికాలో తమ కార్యకలాపాల కోసం మరో ఐటీ దిగ్గజం ఒరాకిల్‌ను టెక్నాలజీ భాగస్వామిగా ఎంచుకుంది. మైక్రోసాఫ్ట్ ఒక ప్రకటనలో ఈ విషయాలు తెలిపింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : చెక్ రిపబ్లిక్ సంస్థ గైడ్‌విజన్‌ను కొనుగోలు చేయనున్న భారత సంస్థ
ఎప్పుడు : సెప్టెంబర్ 14
ఎవరు : ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్
ఎందుకు : చెక్ రిపబ్లిక్, హంగరీ, పోలాండ్, జర్మనీ, ఫిన్‌లాండ్ దేశాల్లోని తమ క్లయింట్లకు మెరుగైన సేవలు అందించడానికి

Published date : 15 Sep 2020 05:44PM