చేతక్ ఈ-స్కూటర్ ఆవిష్కరణ
Sakshi Education
బజాజ్ చేతక్ ఈ-స్కూటర్‌ను కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ న్యూఢిల్లీలో అక్టోబర్ 16న ఆవిష్కరించారు.
భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలు, బయో ఇంధనాలు వంటి పర్యావరణ అనుకూల టెక్నాలజీలదేనని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ మాట్లాడుతూ... చేతక్ ఈ-స్కూటర్ అమ్మకాలు 2020, జనవరి నుంచి మొదలవుతాయని తెలిపారు. ముందుగా పుణెలో ఆ తర్వాత బెంగళూరులో విక్రయాలు ప్రారంభిస్తామన్నారు. మహారాష్ట్రలోని చకన్ ప్లాంటులో చేతక్ ఈ-స్కూటర్స్‌ను తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ-స్కూటర్ ఆవిష్కరణ కార్యక్రమంలో నీతి అయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ కూడా పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బజాజ్ చేతక్ ఈ-స్కూటర్ ఆవిష్కరణ
ఎప్పుడు : అక్టోబర్ 16
ఎవరు : కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ
ఎక్కడ : న్యూఢిల్లీ
క్విక్ రివ్యూ :
ఏమిటి : బజాజ్ చేతక్ ఈ-స్కూటర్ ఆవిష్కరణ
ఎప్పుడు : అక్టోబర్ 16
ఎవరు : కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ
ఎక్కడ : న్యూఢిల్లీ
Published date : 17 Oct 2019 05:47PM