చైనా పురోగమనాన్ని ఏ శక్తీ ఆపలేదు: జిన్‌పింగ్
Sakshi Education
చైనాలో కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం ఏర్పడి అక్టోబర్ 1నాటికి 70 ఏళ్లు పూర్తయ్యాయి.
ఈ సందర్భంగా బీజింగ్‌లోని తియాన్మెన్ స్క్వేర్ వద్ద ఏర్పాటు చేసిన భారీ పరేడ్‌నుద్దేశించి చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ ప్రసంగించారు. ‘చైనా స్థాయిని, చైనా ప్రజలు, జాతి పురోగతిని ఏ శక్తీ అడ్డుకోజాలదు. ప్రజల తరఫున పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను స్థాపిస్తున్నట్లు 70 ఏళ్ల క్రితం మావో ప్రకటించారు. అప్పటి వరకు ఉన్న దయనీయ పరిస్థితుల నుంచి కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో దేశం పూర్తిగా మారిపోయింది’అని జిన్‌పింగ్ తన ప్రసంగంలో అన్నారు.
ఈ పరేడ్‌లో క్షిపణి బ్రిగేడ్‌తోపాటు ఖండాంతర క్షిపణులు, చైనా మొదటి ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ లియోనింగ్‌పై మోహరించిన జె-15 పోరాట విమానాలు, సూపర్‌సోనిక్ సీజే-100 క్షిపణులు, 99 ఏ రకం యుద్ధ ట్యాంకులు, ఆధునిక డ్రోన్లు తదితర 300 కొత్త ఆయుధ వ్యవస్థలను చైనా ప్రదర్శించింది. 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని చైనా ప్రజలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

Published date : 02 Oct 2019 04:51PM