Skip to main content

చార్టర్ టగ్ బోట్లని ఎందుకోసం వినియోగిస్తారు?

స్వావలంబన భారత్ (ఆత్మ నిర్భర్) కార్యక్రమాన్ని మరింత బలంగా ముందుకు తీసుకువెళ్లే చర్యలను కేంద్రప్రభుత్వం అనుసరిస్తోంది.
Current Affairs
దేశీయంగా నిర్మించిన చార్టర్ టగ్ బోట్లనే వినియోగించాలంటూ ప్రధాన పోర్టులను (ఓడరేవులు) షిప్పింగ్ మంత్రిత్వ శాఖా తాజాగా ఆదేశించింది. తద్వారా దేశీ షిప్ బిల్డింగ్ పరిశ్రమకు పునరుత్తేజాన్ని తీసుకురావచ్చన్నది కేంద్రం ఉద్దేశ్యం. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం కింద ఆత్మనిర్భర్ షిప్పింగ్ కోసం చేపట్టిన చర్యగా దీన్ని షిప్పింగ్ శాఖా మంత్రి మన్ సుఖ్ మాండవీయ అభివర్ణించారు. టగ్ బోట్ అన్నది తొట్టి ఆకారంతో కూడిన పడవ. ఓడలు పోర్టుల్లోకి వచ్చేందుకు వీటి సాయం అవసరమవుతుంది.

ప్రశ్నోత్తరాలు రద్దు...
2020 పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు, ప్రయివేటు మెంబర్ బిజినెస్‌ను రద్దు చేస్తున్నట్టు లోక్‌సభ, రాజ్యసభ సెక్రటేరియట్లు వేర్వేరుగా జారీచేసిన బులెటిన్లలో వెల్లడించాయి. సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1 వరకు వారాంతపు సెలవులు కూడా లేకుండా వరుసగా 18 రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ప్రస్తుతం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి ఉన్నారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : దేశీయంగా నిర్మించిన చార్టర్ టగ్ బోట్లనే వినియోగించాలి
ఎప్పుడు : సెప్టెంబర్ 4
ఎవరు : కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖా
ఎక్కడ : దేశ వ్యాప్తంగా
ఎందుకు : దేశీ షిప్ బిల్డింగ్ పరిశ్రమకు పునరుత్తేజాన్ని తీసుకురావచ్చని...
Published date : 05 Sep 2020 05:44PM

Photo Stories