Skip to main content

భద్రతామండలి అధ్యక్ష హోదాలో భారత్‌

ఐక్యరాజ్యసమితిలోని కీలకమైన భద్రతామండలి అధ్యక్ష హోదా భారత్‌ దక్కింది.
2021, ఆగస్టు 1వ తేదీ నుంచి నెల రోజులపాటు పాటు ఈ హోదాలో కొనసాగనుంది. ఈ సమయంలో సముద్రప్రాంత రక్షణ, శాంతిపరిరక్షణ, ఉగ్రవాద నిర్మూలన వంటి ప్రధాన అంశాలపై జరిగే కీలక చర్చలకు నేతృత్వం వహించనుందని ఐరాసలోని భారత శాశ్వత రాయబారి తిరుమూర్తి వెల్లడించారు. 2021 ఏడాది ఆగస్టుతోపాటు 2022 ఏడాది డిసెంబర్‌లో ఈ అవకాశం భారత్‌కు దక్కుతుంది.

పెగసస్‌ దుర్వినియోగంపై ఎన్‌ఎస్‌వో చర్యలు
తాము తయారుచేసిన ‘పెగసస్‌’ స్పైవేర్‌ సాఫ్ట్‌వేర్‌ దుర్వినియోగం అవుతోందని పలు కథనాలు వెలువడి, అనేక దేశాల్లో వివాదమైన నేపథ్యంలో దాని తయారీసంస్థ ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ ఆగ్రహంగా ఉంది. అందుకే తమ సొంత క్లయింట్లు ఆ స్పైర్‌వేర్‌ను వినియోగించడానికి వీల్లేకుండా తాత్కాలికంగా బ్లాక్‌చేసిందని అమెరికా మీడియాలో కథనాలొచ్చాయి. ఎన్‌ఎస్‌వో ఇప్పటికే ఐదు ప్రభుత్వాలను బ్లాక్‌చేసిందని వాషింగ్టన్‌ పోస్ట్‌ పేర్కొంది. వీటిలో మెక్సికో, సౌదీ అరేబియా, దుబాయ్‌ కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఎన్‌ఎస్‌వో సంస్థకు 40 దేశాల్లో 60కిపైగా కస్టమర్లు ఉన్నారని తేలింది.
Published date : 02 Aug 2021 06:00PM

Photo Stories