భారత్‌పై ఐఓసీ ఆంక్షల ఎత్తివేత
Sakshi Education
ప్రపంచ స్థాయి క్రీడా టోర్నీల నిర్వహణ విషయంలో భారత్‌పై విధించిన ఆంక్షలను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) జూన్ 20న ఎత్తివేసింది.
పుల్వామా ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో... 2019, ఫిబ్రవరిలో ఢిల్లీ వేదికగా జరిగిన షూటింగ్ ప్రపంచ కప్‌లో పాల్గొనేందుకు పాకిస్తాన్ షూటర్లకు వీసాలు ఇచ్చేందుకు భారత్ నిరాకరించింది. దీంతో భవిష్యత్‌లో ఒలింపిక్ అర్హత సంబంధిత క్రీడా పోటీల నిర్వహణను కేటాయించేది లేదంటూ ఐఓసీ మన దేశంపై ఆంక్షలు విధించింది. అయితే, ఇకపై అర్హులైన క్రీడాకారులు ఎవరికీ రాజకీయ కారణాలతో వీసాలు నిరాకరించమని భారత్ హామీ ఇవ్వడంతో ఐఓసీ ఆంక్షలు ఎత్తివేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్‌పై ఆంక్షల ఎత్తివేత
ఎప్పుడు : జూన్ 20
ఎవరు : అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్‌పై ఆంక్షల ఎత్తివేత
ఎప్పుడు : జూన్ 20
ఎవరు : అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)
Published date : 21 Jun 2019 05:21PM