భారత్‌లోనే ఇంటర్నెట్ చౌక : కేంద్ర టెలికం మంత్రి
Sakshi Education
ప్రపంచం మొత్తం మీద భారత్‌లోనే మొబైల్ డేటా రేట్లు అత్యంత తక్కువని కేంద్ర టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు.
బ్రిటన్‌కు చెందిన కేబుల్.కో.యూకే అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని పేర్కొన్నారు. డేటా రేట్లకు సంబంధించిన చార్టును డిసెంబర్ 2న మంత్రి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ చార్టు ప్రకారం... ఒక గిగాబైట్ (జీబీ) డేటా సగటు ధర భారత్‌లో 0.26 డాలర్లుగా ఉండగా.. బ్రిటన్‌లో 6.66 డాలర్లు, అమెరికాలో 12.37 డాలర్లుగా ఉంది. ప్రపంచ సగటు 8.53 డాలర్లుగా ఉంది.
డేటా రేట్ల విషయమై మంత్రి స్పందిస్తూ... ‘ట్రాయ్ గణాంకాల ప్రకారం 2014లో ఒక్క జీబీకి చార్జీ రూ. 268.97గా ఉండేది. ప్రస్తుతం ఇది రూ. 11.78కి తగ్గింది’ అని పేర్కొన్నారు. దేశీ టెల్కోలు భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా, రిలయన్‌స జియో .. ఏకంగా 50 శాతం దాకా టారిఫ్‌లను పెంచు తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో మంత్రి స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచం మొత్తం మీద భారత్‌లోనే ఇంటర్నెట్ చౌక
ఎప్పుడు : డిసెంబర్ 2
ఎవరు : కేంద్ర టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్

Published date : 03 Dec 2019 06:17PM