భారత్‌లో తొలి కరోనా కేసు నమోదు
Sakshi Education
ప్రాణాంతక కరోనా వైరస్‌కు సంబంధించి భారత్‌లో తొలి కేసు నమోదైంది.
చైనాలోని వుహాన్ యూనివర్సిటీలో చదువుతున్న కేరళకు చెందిన విద్యార్థినికి ఈ వైరస్ సోకినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని జనవరి 30న భారత ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్‌కు సంబంధించి దేశంలోని పలు నగరాల్లో అనుమానిత కేసులు నమోదయ్యాయి. కానీ వైరస్ సోకినట్లు ధ్రువీకరించిన తొలి కేసు ఇదే. మరోవైపు చైనాలోని వుహాన్ నుంచి భారతీయులను తిరిగి వెనక్కి రప్పించేందుకు భారత ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
170 మంది మృతి..
చైనాలో కరోనా వైరస్ బారినపడి జనవరి 30నాటికి 170 మంది మరణించారు. మరో 7,711 మందికి ఈ వైరస్ సోకినట్లు గుర్తించారు. ఈ ప్రాణాంతక వైరస్ ప్రపంచవ్యాప్తంగా 17 దేశాలకు విస్తరించింది. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దాదాపు నాలుగు బిలియన్ డాలర్ల నిధులను చైనా ప్రభుత్వం కేటాయించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కరోనా వైరస్‌కు సంబంధించి భారత్‌లో తొలి కేసు నమోదు
ఎప్పుడు : జనవరి 30
ఎవరు : భారత ప్రభుత్వం
ఎక్కడ : కేరళ

Published date : 31 Jan 2020 05:31PM