Skip to main content

భారత్‌లో లోటు వర్షపాతం : స్కైమెట్

2019 సంవత్సరంలో భారత్‌లో సాధారణం కంటే తక్కువస్థాయి వర్షపాతం నమోదవుతుందని ప్రముఖ ప్రైవేటు వాతావరణ అంచనా సంస్థ స్కైమెట్ తెలిపింది.
నైరుతీ రుతుపవనాల ప్రభావంతో జూన్-సెప్టెంబర్ మధ్యకాలంలో దీర్ఘకాలిక సగటు(ఎల్‌పీఏ)లో 93 శాతం వర్షపాతం మాత్రమే నమోదవుతుందని అంచనా వేసింది. ఎల్‌నినో ఏర్పడొచ్చనీ, ఇది నైరుతీ రుతుపవనాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది.

1951 నుంచి 2000 వరకూ కురిసిన వర్షపాతాన్ని ఎల్‌పీఏగా వ్యవహరిస్తారు. ఇది 89 సెం.మీగా ఉంది. భారత్‌లో వ్యవసాయ రంగానికి జీవనాధారమైన నైరుతీ రుతుపవనాలు జూన్ 1న కేరళ తీరాన్ని తాకనున్నాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి : 2019లో భారత్‌లో లోటు వర్షపాతం
ఎప్పుడు : ఏప్రిల్ 3
ఎవరు : స్కైమెట్
Published date : 04 Apr 2019 06:03PM

Photo Stories