భారత్‌లో కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి
Sakshi Education
కరోనాను అంతం చేసే వ్యాక్సిన్‌ను వచ్చే రెండు మూడు వారాల్లో అభివృద్ధి చేస్తామని, మనుషులపై క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతే అక్టోబర్ నాటికి మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
వూహాన్‌లో కోవిడ్ రోగులు జీరో
కరోనా వైరస్ పుట్టిన చైనాలో వూహాన్ మరో విజయాన్ని సాధించింది. కోవిడ్–19తో చికిత్స పొందుతున్న రోగులు ఒక్కరంటే ఒక్కరు కూడా ఆస్పతుల్లో లేరు. వ్యాధి నుంచి కోలుకొన్న 11 మందిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయడంతో రోగుల సంఖ్య జీరోకి వచ్చింది. 2019 డిసెంబర్ చివరి వారంలో వైరస్ బయటపడిన తర్వాత తొలిసారిగా కరోనా రోగుల విషయంలో జీరో అన్నది సాధించామని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది. 76 రోజుల పాటు లాక్‌డౌన్‌లో ఉన్న వూహాన్‌లో ఏప్రిల్ 8న లాక్‌డౌన్ ఎత్తేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి
ఎప్పుడు : ఏప్రిల్ 26
ఎవరు : సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాఎక్కడ : భారత్
ఈ వ్యాక్సిన్‌ను భారత్‌లో తాము ఉత్పత్తి చేస్తామని మహారాష్ట్రలోని పుణేకు చెందిన ‘సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా’ ఏప్రిల్ 26న ప్రకటించింది. ఈ సంస్థ ఆక్స్‌ఫర్డ్ వర్సిటీతో భాగస్వామ్యం కలిగి ఉంది. తమ పరిశోధకుల బృందం ఆక్స్‌ఫర్డ్ వర్సిటీతో కలిసి పనిచేస్తోందని, కరోనా వ్యాక్సిన్‌ను ఉత్పత్తిని త్వరలో ప్రారంభిస్తామన్న నమ్మకం ఉందని, మొదటి ఆరు నెలలపాటు నెలకు 50 లక్షల చొప్పున డోసులను తయారు చేస్తామని ‘సెరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా’ సీఈవో అడార్ పూనావాలా వెల్లడించారు. అనంతరం నెలకు కోటి డోసుల చొప్పున ఉత్పత్తి చేస్తామని పేర్కొన్నారు.
వూహాన్‌లో కోవిడ్ రోగులు జీరో
కరోనా వైరస్ పుట్టిన చైనాలో వూహాన్ మరో విజయాన్ని సాధించింది. కోవిడ్–19తో చికిత్స పొందుతున్న రోగులు ఒక్కరంటే ఒక్కరు కూడా ఆస్పతుల్లో లేరు. వ్యాధి నుంచి కోలుకొన్న 11 మందిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయడంతో రోగుల సంఖ్య జీరోకి వచ్చింది. 2019 డిసెంబర్ చివరి వారంలో వైరస్ బయటపడిన తర్వాత తొలిసారిగా కరోనా రోగుల విషయంలో జీరో అన్నది సాధించామని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది. 76 రోజుల పాటు లాక్‌డౌన్‌లో ఉన్న వూహాన్‌లో ఏప్రిల్ 8న లాక్‌డౌన్ ఎత్తేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి
ఎప్పుడు : ఏప్రిల్ 26
ఎవరు : సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా
Published date : 27 Apr 2020 07:27PM