భారత్‌లో కోవిషీల్డ్‌ను తయారు చేస్తున్న సంస్థ పేరు?
కోవిషీల్డ్‌ను తొలి విడతలో 1.1 కోట్ల డోసులు, రెండో విడతలో ఏప్రిల్ కల్లా మరో 4.5 కోట్ల డోసులు కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. అలాగే కోవాగ్జిన్‌ను రూ.162 కోట్ల విలువైన 55 లక్షల డోసులను కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. రెండు టీకాల కోసం మొత్తం రూ.1,300 కోట్ల వ్యయం చేయనున్నారు.
సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌లో తయారీ...
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆట్రాజెనెకా కంపెనీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను భారత్‌లో పుణేకి చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తోంది. కోవాగ్జిన్ టీకాను భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేస్తోంది.
టీకా ఖర్చు కేంద్రానిదే...
కరోనా టీకాను తొలిదశలో 3 కోట్ల మందికిపైగా ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు అందజేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఇందుకయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. జనవరి 11న రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన ప్రధాని ఈ మేరకు తెలిపారు.