Skip to main content

భారత్‌లో హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యం కాదు

భారత్‌లో కరోనా వైరస్‌ను హెర్డ్ ఇమ్యూనిటీ ద్వారా నియంత్రించలేమని వెల్లడైంది. భారత్‌లాంటి అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యం కాదని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది.
Current Affairsకొన్ని ప్రాంతాల్లో నివసించే జనాభాలో కరోనా వైరస్‌ను తట్టుకునే యాంటీబాడీలు బాగా అభివృద్ధి చెందినప్పటికీ అవి స్వల్పకాలం మాత్రమే ఉంటాయని వెల్లడించింది. టీకా కార్యక్రమం ద్వారా మాత్రమే ఇమ్యూనిటీని సాధించగలమని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారి రాజేష్ భూషణ్ జూలై 30న వెల్లడించారు.

ఆగస్ట్ 15లోగా రష్యా టీకా..
2020, ఆగస్ట్ 10 లేదా ఆగస్ట్ 12వ తేదీలోగా విడుదల చేసేందుకు రష్యా సిద్ధమవుతోంది. గామాలెయ ఇన్‌స్టిట్యూట్ రూపొందించిన ఈ టీకాకు సాధ్యమైనంత త్వరగా అనుమతి ఇవ్వాలని రష్యా భావిస్తోందని ఈ మొత్తం ప్రక్రియతో సంబంధమున్న అధికారిని ఉటంకిస్తూ ‘బ్లూమ్‌బర్గ్’ఒక కథనం ప్రచురించింది. ఆగస్ట్ 15లోగా ప్రజల వినియోగానికి అనుమతి లభించవచ్చని అధికార మీడియా ప్రకటించింది. మరోవైపు, ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ రూపొందిస్తున్న టీకాను ఉత్పత్తి చేసేందుకు ఆస్ట్రాజెనెకాతో రష్యాకు చెందిన ఆర్ ఫార్మా ఒప్పందం కుదుర్చుకుంది. ఆక్స్‌ఫర్డ్ టీకా పరిశోధనలను దొంగిలించేందుకు రష్యా హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారని బ్రిటన్, కెనడా, అమెరికా ఆరోపిస్తుండగా ఈ ఒప్పందం కుదిరింది.
Published date : 01 Aug 2020 12:56PM

Photo Stories