భారత్‌కు అత్యధిక ఎఫ్‌డీఐలు ఏ దేశం నుంచి వచ్చాయి?
పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహ విభాగం (డీపీఐఐటీ) గణాంకాల ప్రకారం... 2000 ఏప్రిల్ నుంచి 2020 సెప్టెంబర్ మధ్య కాలంలో 500.12 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. వీటిలో అత్యధికంగా 29 శాతం(144.71 బిలియన్ డాలర్లు) ఎప్‌డీఐలు మారిషస్ దేశం నుంచి వచ్చాయి.
మారిషస్ తర్వాత... సింగపూర్ (21 శాతం), అమెరికా(7 శాతం), నెదర్లాండ్‌స(7 శాతం), జపాన్ (7 శాతం), బ్రిటన్ (6 శాతం) దేశాల నుంచి అధిక ఎఫ్‌డీఐలు దేశంలోకి వచ్చాయి. 2019-20లో రికార్డు స్థాయిలో 50 బిలియన్ డాలర్లు వచ్చాయి.
సేవల రంగంలో అధికంగా...
సేవల రంగం, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్.. హార్డ్‌వేర్, టెలికమ్యూనికేషన్స్, ట్రేడింగ్, నిర్మాణ రంగం, ఆటోమొబైల్, రసాయనాలు, ఫార్మా తదితర రంగాలు.. దేశంలోకి అత్యధిక స్థాయిలో ఎఫ్‌డీఐలను ఆకర్షించాయి.
మారిషస్ రాజధాని: పోర్ట్ లూయిస్; కరెన్సీ: మారిషస్ రుపీ
మారిషస్ ప్రస్తుత అధ్యక్షుడు: పృథ్వీరాజ్‌సింగ్ రూపన్
మారిషస్ ప్రస్తుత ప్రధాని: ప్రవీంద్ జుగ్నౌత్