Skip to main content

భారతీయ చేపల ప్యాకెట్లపై కరోనా: చైనా

భారత్ సహా వేర్వేరు దేశాల నుంచి దిగుమతి చేసుకున్న చేపల ప్యాకెట్లపై కరోనా వైరస్ ఆనవాళ్లను గుర్తించినట్లు చైనా అధికారులు ప్రకటించారు.
Edu news భారత్, రష్యా, అర్జెంటీనా తదితర దేశాల నుంచి వచ్చిన ఈ ప్యాకెట్లను పరీక్షించగా వాటిపై కరోనా ఆనవాళ్లు ఉన్నట్లు తేలిందని నవంబర్ 19న గ్లోబల్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. భారత్ నుంచి దిగుమతి అయిన ప్యాకెట్లపై వైరస్ ఆనవాళ్లు ఉన్నాయంటూ చైనా ప్రకటించడం ఇది రెండోసారి.

స్మార్ట్ సైనిక శిబిరాలు...
వాస్తవాధీన రేఖ వెంబడి తూర్పు లద్దాఖ్‌లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సైనికులు సమర్థంగా పనిచేయడానికి వీలుగా స్మార్ట్ శిబిరాలను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చలిని తట్టుకోవడానికి శిబిరాల్లో హీటర్లు, 24 గంటలు వేడి నీళ్ల సదుపాయం, విద్యుత్, బెడ్లు, కబోర్డులు ఇలా అన్ని సదుపాయాలను ఈ శిబిరాల్లో ఏర్పాటు చేశారు. చైనా కూడా భారత్‌లోని లద్దాక్ సరిహద్దుల్లో ఆధునిక సదుపాయాలతో సైనిక శిబిరాలు ఏర్పాటు చేసింది.
Published date : 19 Nov 2020 06:43PM

Photo Stories