భారతదేశంలో శ్రీశైలం పుస్తకావిష్కరణ
Sakshi Education
శ్రీశైల పుణ్యక్షేత్ర చరిత్ర, సంస్కృతి, వీర శైవమత విశిష్టతను తెలిపే ‘దక్షిణ భారతదేశంలో పవిత్ర శ్రీశైలం’ అనే పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం ఆవిష్కరించారు.
ఏపీ సచివాలయంలోని మొదటి బ్లాకులో ఆగస్టు 30న ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీశైలంలోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పీఠాధిపతి, రాష్ట్ర పురావస్తు శాఖ మాజీ సంచాలకులు ఆచార్య పెద్దారపు చెన్నారెడ్డి ఈ పుస్తకాన్ని గ్రంథస్తం చేశారు. శ్రీశైల పుణ్యక్షేత్ర చరిత్రతోపాటు పంచమఠాలు, అక్కమహాదేవి చరిత్ర, పండుగలు, జాతరలు, మధ్యయుగం నాటి వీరశైవ మత వ్యాప్తి, అనాటి నాణేల విశిష్టతను ఈ పుస్తకం తెలియజేస్తోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దక్షిణ భారతదేశంలో పవిత్ర శ్రీశైలం పుస్తకావిష్కరణ
ఎప్పుడు : ఆగస్టు 30
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం
ఎక్కడ : ఏపీ సచివాలయం
క్విక్ రివ్యూ :
ఏమిటి : దక్షిణ భారతదేశంలో పవిత్ర శ్రీశైలం పుస్తకావిష్కరణ
ఎప్పుడు : ఆగస్టు 30
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం
ఎక్కడ : ఏపీ సచివాలయం
Published date : 31 Aug 2019 05:29PM