భారత వృద్ధి రేటుకు ఏడీబీ కోత
Sakshi Education
2019-2020 ఆర్థిక సంవత్సరానికి గాను భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాలను ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) తగ్గించింది.
ఇంతక్రితం ఈ అంచనా 7.2 శాతం అయితే దీనిని 6.5 శాతానికి కుదించింది. ఈ మేరకు సెప్టెంబర్ 25న ఒక నివేదికను విడుదల చేసింది. తయారీ రంగం బలహీనత, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలహీనత, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో క్రియాశీలత లేకపోవడం వంటి అంశాలు వృద్ధి రేటుకు కారణమని ఏడీబీ తన నివేదికలో పేర్కొంది. అయితే వృద్ధి వేగంలో చైనా కన్నా భారత్ ముందు ఉందని వివరించింది. 2019, ఏడాది తొలి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) భారత్ వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్టం 5 శాతానికి పడివడం తెలిసిందే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2019-2020లో భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 6.5 శాత మే
ఎప్పుడు : సెప్టెంబర్ 25
ఎవరు : ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ)
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2019-2020లో భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 6.5 శాత మే
ఎప్పుడు : సెప్టెంబర్ 25
ఎవరు : ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ)
Published date : 26 Sep 2019 08:05PM