Skip to main content

భారత వాయుసేనలోకి అపాచీ హెలికాప్టర్లు

ప్రపంచంలోనే అత్యంత ఆధునిక అపాచీ ఎహెచ్-64ఇ యుద్ధ హెలికాప్టర్లు భారత్ అమ్ముల పొదిలో చేరాయి.
మొత్తం ఎనిమిది హెలికాప్టర్లను పఠాన్ కోట వైమానిక దళానికి అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ సెప్టెంబర్ 3న అందించింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎయిర్ చీఫ్ మార్షల్ బిఎస్ ధనోవా, ఎయిర్ మార్షల్ ఆర్ నంబియార్ హెలికాప్టర్లకు పూజలు చేశారు.

కేంద్ర ప్రభుత్వం అమెరికా ప్రభుత్వం, బోయింగ్ సంస్థలతో 2015లో 22 హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది. 2019, జూలైలో నాలుగు హెలికాప్టర్లు అప్పగించారు. ఆఖరి విడత మార్చి 2020 నాటికల్లా బోయింగ్ సంస్థ అందించాల్సి ఉంది. కాలం చెల్లిన ఎంఐ-35 హెలికాప్టర్ల స్థానంలో అపాచీ కొనుగోలు చేశారు.

అపాచీ హెలికాప్టర్ల ప్రత్యేకతలు
  • గంటకి 284 కి.మీ. వేగంతో దూసుకెళ్లేందుకు సాయపడే రెండు టర్బోషాఫ్ట్ ఇంజిన్లు
  • ఎత్తు : 15.24 అడుగులు
  • బరువు : 6,838 కేజీలు
  • రెండు రెక్కలను కలుపుతూ కొనల మధ్య దూరం: 17.15 అడుగులు
  • ఒకేసారి 8 క్షిపణుల్ని ప్రయోగించే సత్తా
  • నిట్టనిలువుగా ఎగిరే సామర్థ్యం : నిముషానికి 2 వేల అడుగులు కంటే ఎక్కువ
  • ఒక్కో నిమిషానికి గరిష్టంగా ఎగరగల ఎత్తు : 2,800 అడుగుల కంటే ఎక్కువ
  • అన్నిరకాల ప్రతికూల వాతావరణాల్లోనూ రేయింబగళ్లు ప్రయాణించే ఆధునిక సాంకేతికత
  • లక్ష్యాలను ఛేదించడానికి లేజర్, ఇన్‌ఫ్రారెడ్ వ్యవస్థ
  • 35 ఎంఎం ఫిరంగులు ఒకేసారి 1200 రౌండ్లు కాల్చే సామర్థ్యం
  • యుద్ధభూముల్ని ఎప్పటికప్పుడు ఫోటోలు తీసి పంపే సదుపాయం
Published date : 05 Sep 2019 06:09PM

Photo Stories