భారత్, ఉజ్బెకిస్తాన్ మధ్య తొమ్మది ఒప్పందాలు
Sakshi Education
భారత్, ఉజ్బెకిస్తాన్ మధ్య వివిధ రంగాల్లో తొమ్మది ఒప్పందాలు కుదిరాయి.
ఉగ్రవాద నిర్మూలన కోసం పాటుపడ్తామని ఇరు దేశాలు ప్రతినబూనాయి. ప్రధాని నరేంద్ర మోదీ, ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు శావ్‌కట్ మిర్జియోయెవ్ డిసెంబర్ 11న వర్చువల్ విధానంలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పునరుత్పాదిత ఇంధనం, డిజిటల్, సైబర్ టెక్నాలజీ, కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులు, వస్తు రవాణా, సమాచార మార్పిడి వంటి రంగాల్లో మొత్తం 9 ఒప్పందాలు కుదిరాయి. అలాగే, ఉజ్బెకిస్తాన్‌లో అభివృద్ధి కార్యక్రమాల కోసం భారత్ 44.8 కోట్ల డాలర్ల రుణాన్ని అందించేందుకు అంగీకరించింది.
ఉజ్బెకిస్తాన్ రాజధాని: తాష్కెంట్; కరెన్సీ: ఉజ్బెకిస్తాన్ సోమ్
ఉజ్బెకిస్తాన్ ప్రస్తుత అధ్యక్షుడు: శావ్‌కట్ మిర్జియోయెవ్
ఉజ్బెకిస్తాన్ ప్రస్తుత ప్రధాని: అబ్దుల్లా అరిపోవ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్, ఉజ్బెకిస్తాన్ మధ్య తొమ్మది ఒప్పందాలు
ఎప్పుడు : డిసెంబర్ 11
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ, ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు శావ్‌కట్ మిర్జియోయెవ్
ఎందుకు : పునరుత్పాదిత ఇంధనం, డిజిటల్, సైబర్ టెక్నాలజీ, కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులు, వస్తు రవాణా, సమాచార మార్పిడి వంటి రంగాల్లో పరస్పర సహకారం కోసం

Published date : 12 Dec 2020 05:40PM