భారత పర్యటనలో బ్రిటన్ యువరాజు
Sakshi Education
రెండురోజుల పర్యటన కోసం బ్రిటన్ యువరాజు ప్రిన్స్ ఛార్లెస్ నవంబర్ 13న భారత్ చేరుకున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనకు స్వాగతం పలికారు. రాష్ట్రపతి భవన్‌లోని ఔషధీవనంలో ప్రిన్స్ ఛార్లెస్ మొక్కను నాటారు. అనంతరం గురుద్వారా బంగ్లా సాహిబ్‌ను సందర్శించారు. అక్కడి ప్రసాదం తయారీశాలకు వెళ్లి రోటీలు తయారు చేశారు. గురునానక్ 550వ జయంతి సమయంలో ఇక్కడికి రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రిన్స్ ఛార్లెస్ అధికారిక పర్యటన నిమిత్తం భారత్‌కు రావడం ఇది పదోసారి.
Published date : 14 Nov 2019 05:39PM