భారత పర్యావరణ కృషి భేష్ : ఐరాస
Sakshi Education
పర్యావరణ పరిరక్షణ కోసం భారత్ చేస్తున్న కృషి అద్భుతమని, సంప్రదాయేతర ఇంధన రంగాన్ని ముందుకు పరుగులు పెట్టించడంలో ఆ దేశం అమోఘంగా పనిచేస్తోందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ కొనియాడారు.
ఐక్యరాజ్య సమితి పర్యావరణ సదస్సుని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గుటెరెస్ ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఐరాస ప్రధాన కార్యాలయంలో ఏర్పాటైన గాంధీజీ సోలార్ పార్క్‌ని ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 24న ప్రారంభించనున్నారు.
Published date : 23 Sep 2019 05:35PM