Skip to main content

భారత్ నుంచి భూటాన్, మాల్దీవులకు కరోనా టీకాలు

‘పొరుగు దేశాలకే తొలి ప్రాధాన్యం’ అనే తన విధానంలో భాగంగా భూటాన్, మాల్దీవులకు భారత్ కరోనా టీకాలు సరఫరా చేసింది.
Current Affairs

గ్రాంట్స్ అసిస్టెన్స్ కింద జనవరి 20న భూటాన్‌కు 1,50,000 కోవిషిల్డ్ వ్యాక్సిన్ డోసులు, మాల్దీవులకు లక్ష డోసులను అందజేసింది. అలాగే జనవరి 21న బంగ్లాదేశ్‌కు 20 లక్షల డోసులు, నేపాల్‌కు 10 లక్షల డోసులను సరఫరా చేసింది. ఈ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని ‘‘వ్యాక్సిన్ మైత్రి’’గా భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ సంభోదించారు. భూటాన్, మాల్దీవులు, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, సీషెల్స్, శ్రీలంక, అఫ్గానిస్తాన్, మారిషస్ దేశాలకు టీకాలను సరఫరా చేయనున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే.

Published date : 22 Jan 2021 04:32PM

Photo Stories