Skip to main content

భారత మహిళలదే వన్డే సిరీస్

ఇప్పటికే టి20 సిరీస్‌ను గెల్చుకున్న భారత మహిళల జట్టు అదే దూకుడుతో వన్డే సిరీస్‌ను వశం చేసుకుంది.
దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో అక్టోబర్ 11న జరిగిన రెండో వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పూనమ్ రౌత్ (92 బంతుల్లో 65; 7 ఫోర్లు), కెప్టెన్ మిథాలీ రాజ్ (82 బంతుల్లో 66; 8 ఫోర్లు) అర్ధ సెంచరీల కారణంగా భారత్ మరో రెండు ఓవర్లు ఉండగానే విజయాన్ని అందుకుంది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో దక్కించుకుంది.

క్విక్ రివ్యూ:
ఏమిటి:
భారత మహిళలదే వన్డే సిరీస్
ఎప్పుడు: అక్టోబర్ 11, 2019
ఎక్కడ: వడోదర
Published date : 12 Oct 2019 04:32PM

Photo Stories