భారత్ కీ లక్ష్మి రాయబారులుగా సింధు, దీపిక
Sakshi Education
సినీ నటి దీపికా పదుకొనే, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధులను ‘భారత్ కీ లక్ష్మి’రాయబారులుగా ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 22న ప్రకటించారు.
వేర్వేరు రంగాల్లో మహిళా సాధికారతకు తోడ్పడిన స్త్రీ మూర్తులను 2019 దీపావళి సందర్భంగా ‘భారత్‌కీ లక్ష్మి’ పేరుతో గౌరవించుకుందామంటూ ఇటీవలి ‘మన్‌కీ బాత్’లో ప్రధాని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ప్రధాని ఉద్యమానికి ట్విట్టర్‌లో సింధు, దీపిక మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మోదీ స్పందిస్తూ... మహిళా సాధికారితకు పాటుపడటం భారత సంస్కృతిలోనే ఉందని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్ కీ లక్ష్మి రాయబారులుగా నియామకం
ఎప్పుడు : అక్టోబర్ 22
ఎవరు : సినీ నటి దీపికా పదుకొనే, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్ కీ లక్ష్మి రాయబారులుగా నియామకం
ఎప్పుడు : అక్టోబర్ 22
ఎవరు : సినీ నటి దీపికా పదుకొనే, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు
Published date : 23 Oct 2019 06:00PM