Skip to main content

భారత్‌ జీడీపీ వృద్ధి రేటు 2 శాతం లోపే

భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2020–2021 ఆర్థిక సంవత్సరంలో 2 శాతం దిగువనకు పడిపోతుందని దేశీయ రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్, అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ ఫిచ్‌– భారత్‌ వ్యవహారాల ఏజెన్సీ ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ అంచనావేశాయి.
Current Affairs
ఆయా సంస్థల తాజా అంచనాలను పరిశీలిస్తే... భారత్‌ జీడీపీ 2020–21 ఆర్థిక సంవత్సరంలో 1.8 శాతంగా నమోదవుతుంది. కరోనా నేపథ్యంలో ఆర్థిక సంవత్సరం మొత్తంలో భారత్‌కు రూ.10 లక్షల కోట్లు లేదా ఒక వ్యక్తికి తలసరి రూ.7,000 నష్టం జరుగుతుంది. సంక్షోభాన్ని ఎదుర్కొనడానికి ఒక్క లాక్‌డౌన్‌తో సరిపెట్టుకోకుండా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకోవాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 29 సంవత్సరాల కనిష్టానికి పడిపోయి, కేవలం 1.9 శాతంగా నమోదవుతుంది. అయితే మే 15వ తేదీ దాటిన తర్వాతా లాక్‌డౌన్‌ కొనసాగే పరిస్థితి ఉంటే, ఆర్థిక వ్యవస్థలో అసలు వృద్ధిలేకపోగా –2.1 శాతం క్షీణించే అవకాశం ఉంది. ద్రవ్యలోటు 4.4 నుంచి 6 శాతం వరకూ ఉండవచ్చు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : 2020–2021 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ జీడీపీ వృద్ధి రేటు 2 శాతం లోపే
ఎప్పుడు : ఏప్రిల్ 27
ఎవరు : క్రిసిల్, ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌
ఎందుకు : కరోనా నేపథ్యంలో
Published date : 28 Apr 2020 06:54PM

Photo Stories