భారత ఐటీ రంగ పితామహుడు అస్తమయం
Sakshi Education
ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్ వ్యవస్థాపక సీఈవో, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, భారత ఐటీ రంగ పితామహునిగా పరిగణించే ఫాఖిర్ చంద్ సీ కోహ్లీ (ఎఫ్‌సీ కోహ్లీ) కన్నుమూశారు.
గుండెపోటు కారణంగా నవంబర్ 26న ముంబైలో తుదిశ్వాస విడిచారు. 1969లో టాటా గ్రూప్‌లో చేరిన కోహ్లీ.. 1996 వరకు టీసీఎస్ సీఈవోగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన వయసు 96 ఏళ్లు.
పాకిస్తాన్‌లోని పెషావర్ పట్టణంలో 1924, మార్చి 19న జన్మించిన ఎఫ్‌సీ కోహ్లీ పంజాబ్ యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కెనడాలోని క్వీన్స్ యూనివర్సిటీ నుంచి ఎలక్టిక్రల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ పొందారు. 1951లో అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) నుంచి ఎలక్టిక్రల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ పట్టా అందుకున్నారు. 1969 నుంచి 1996 వరకు టీసీఎస్ సీఈవోగా పనిచేశారు. 1995-96 మధ్య కాలంలో నాస్కామ్(నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్) అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2002లో పద్మ భూషణ్ అవార్డును అందుకున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత ఐటీ రంగ పితామహుడు అస్తమయం
ఎప్పుడు : నవంబర్ 26
ఎవరు : ఫాఖిర్ చంద్ సీ కోహ్లీ (ఎఫ్‌సీ కోహ్లీ)(96)
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
ఎందుకు : గుండెపోటు కారణంగా

Published date : 27 Nov 2020 06:05PM