Skip to main content

బయోడీజిల్ పథకం ప్రారంభం

వాడేసిన వంటనూనె నుంచి ఉత్పత్తి చేసిన బయోడీజిల్‌ను కొనుగోలు చేసే బయోడీజిల్ కొనుగోలు పథకాన్ని ప్రభుత్వరంగ ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ప్రారంభించాయి.
ప్రపంచ బయోడీజిల్ దినోత్సవ సందర్భంగా పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఆగస్టు 10న అధికారికంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ బయోడీజిల్ పథకం కింద... 100 పట్టణాల్లో వినియోగించిన మిగిలిన వంట నూనె నుంచి బయోడీజిల్ ఉత్పత్తి చేసే ప్లాంట్ల ఏర్పాటుకు ఆసక్తి కలిగిన వారి నుంచి దరఖాస్తులను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఆహ్వానించనున్నాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
బయోడీజిల్ కొనుగోలు పథకం ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 10
ఎవరు : కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రదాన్
Published date : 12 Aug 2019 05:46PM

Photo Stories