Skip to main content

బ్యాంకాక్‌లో తూర్పు ఆసియా దేశాల సదస్సు

థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో నవంబర్ 4న 14వ తూర్పు ఆసియా దేశాల శిఖరాగ్ర సదస్సు(ఈఏఎస్) జరిగింది.
ఉగ్రవాదాన్ని, అంతర్జాతీయ నేరాలను అరికట్టడానికి మరింత ముమ్మరమైన ప్రయత్నాలు చేయాలని, ఐరాసలోని సంబంధిత సంస్థలతో సమన్వయం చేసుకోవాలని ఈ సదస్సు తీర్మానించింది. ఈ సమావేశంలో భారత్ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈఏఎస్‌ను 2020లో భారత్‌లోని చెన్నైలో నిర్వహించాలని ఈ సందర్భంగా మోదీ కోరారు.

ఈఏఎస్‌లోని 18 సభ్య దేశాలు
ఆస్ట్రేలియా, బ్రూనై, కాంబోడియా, చైనా, భారత్, ఇండోనేషియా, జపాన్, లావోస్, మలేషియా, మయన్మార్, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, రష్యా, సింగపూర్, దక్షిణ కొరియా, థాయిలాండ్, అమెరికా, వియత్నాం.

జపాన్, ఆస్ట్రేలియా ప్రధానులతో మోదీ భేటీ
తూర్పు ఆసియా దేశాల సదస్సు సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, వియత్నాం ప్రధాని గుయెన్ చాన్ ఫుక్, జపాన్ ప్రధాని షింజో అబెలతో ప్రధాని మోదీ వేర్వేరుగా భేటీ అయ్యారు. కీలక ద్వైపాక్షిక, భద్రత, వాణిజ్యం, ప్రాంతీయ అంశాలపై వారితో చర్చలు జరిపారు. మరోవైపు మయన్మార్ స్టేట్ కౌన్సిలర్ ఆంగ్ సాన్ సూకీతోనూ మోదీ సమావేశమయ్యారు. సరిహద్దు ప్రాంతాల్లో తిరుగుబాటుదారులను నియంత్రించేందుకు సహకారం అందించాలని ఆమెను మోదీ కోరారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
14వ తూర్పు ఆసియా దేశాల శిఖరాగ్ర సదస్సు(ఈఏఎస్)
ఎప్పుడు : నవంబర్ 4
ఎక్కడ : బ్యాంకాక్, థాయ్‌లాండ్
Published date : 05 Nov 2019 05:36PM

Photo Stories