Skip to main content

బ్యాగ్స్ ఆన్ వీల్స్ పథకంను తొలుత ఏ రైల్వే జోన్‌లో ప్రారంభించనున్నారు?

ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా నెట్‌వర్క్‌గా గుర్తింపు పొందిన భారతీయ రైల్వే శాఖ మరో కొత్త సేవలకు శ్రీకారం చుట్టనుంది.
Edu news దేశంలో రైల్వే ప్రయాణికులకు ‘బ్యాగ్ ఆన్ వీల్స్’ సదుపాయం కల్పించాలని నిర్ణయించింది. తొలుత ఘజియాబాద్, ఢిల్లీ, గుర్గావ్ తదితర స్టేషన్లలో బ్యాగ్ ఆన్ వీల్స్ సేవలను ప్రారంభించేందుకు ఉత్తర రైల్వే రంగం సిద్ధం చేసింది.
బ్యాగ్ ఆన్ వీల్స్ ద్వారా...
  • యాప్ ఆధారిత పథకమైన బ్యాగ్ ఆన్ వీల్స్ సదుపాయంతో ప్రయాణికులకు ఇకపై తమ లగేజీని మోసే భారం తప్పతుంది. ఈ పథకం కింద రైల్వే శాఖ డోర్ టు డోర్ సేవలు ప్రారంభించనుంది.
  • రైల్వే శాఖ తీసుకురానున్న బ్యాగ్స్ ఆన్ వీల్స్’ (బీవోడబ్ల్యూ) అనే మొబైల్ యాప్‌ను ఉపయోగించి ప్రయాణికులు తమ సామాన్లను రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి రైల్వే స్టేషన్‌కు తరలించే సేవలు పొందవచ్చు. ప్రయాణికుల బ్యాగేజీలను భద్రంగా చేరుస్తారు. ఇందుకోసం నిర్ణీత రుసుం చెల్లిస్తే చాలు.
  • దేశంలో రైల్వే ప్రయాణికులకు ఇలాంటి సదుపాయం అందుబాటులోకి వస్తుండడం ఇదే మొదటిసారి. టికెటేతర ఆదాయాన్ని పెంచుకోవడంలో భాగంగా రైల్వే శాఖ ఈ పథకానికి శ్రీకారం చుడుతోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి :
బ్యాగ్ ఆన్ వీల్స్ పథకం ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 22
ఎవరు : భారతీయ రైల్వే
ఎక్కడ : ఉత్తర రైల్వే జోన్ పరిధిలో
ఎందుకు : ప్రయాణికుల సామాన్లను రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి రైల్వే స్టేషన్‌కు తరలించేందుకు
Published date : 23 Oct 2020 06:31PM

Photo Stories