బ్రూనైలో కొత్త షరియా చట్టాల అమలు
Sakshi Education
ఆగ్నేయాసియా దేశమైన బ్రూనైలో కొత్త కఠిన షరియా చట్టాలు ఏప్రిల్ 3 నుంచి అమల్లోకి వచ్చాయి. కొత్త చట్టాల ప్రకారం వ్యభిచారం, ఇద్దరు పురుషుల మధ్య లైంగిక చర్యలకు రాళ్లతో కొట్టి చంపడాన్ని శిక్షగా విధించనున్నారు.
అత్యాచారం, దోపిడీ, ప్రవక్త మహ్మద్‌ను అవమానించడం వంటి నేరాలకు కూడా మరణశిక్ష వర్తిస్తుంది. ఆ దేశ రాజధాని బందర్ సేరీ బెగవాన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో బ్రూనై సుల్తాన్ హసనల్ బోల్కియ మాట్లాడుతూ.. ఈ దేశంలో ఇస్లామిక్ బోధనలు బలంగా పెరగాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కొత్త షరియా చట్టాల అమలు
ఎప్పుడు : ఏప్రిల్ 3
ఎక్కడ : బ్రూనై
క్విక్ రివ్యూ :
ఏమిటి : కొత్త షరియా చట్టాల అమలు
ఎప్పుడు : ఏప్రిల్ 3
ఎక్కడ : బ్రూనై
Published date : 04 Apr 2019 06:04PM